Azam Khan House BJP Mla : ఆజం ఖాన్ ఇల్లు బీజేపీ ఎమ్మెల్యేకు
ఆకాష్ సక్సేనాకు సర్కార్ కేటాయింపు
Azam Khan House BJP Mla : సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ క్యాబినెట్ మంత్రి ఆజం ఖాన్ కు ఈ ఏడాది కలిసి రాలేదు. కోలుకోలేని రీతిలో షాక్ తగిలింది. తన హవాకు చెక్ పెట్టారు యుపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. నోరు పారేసుకున్న కేసులో ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. చివరకు ఇక్కడ సమాజ్ వాది పార్టీ తన అభ్యర్థిని నిలిపినా గెలిపించు కోలేక పోయింది.
ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చెందిన ఆకాష్ సక్సేనా అద్భుతమైన విజయాన్ని సాధించారు. దీంతో శుక్రవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆజాం ఖాన్ అధికారిక లక్నో నివాసాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనాకు(Azam Khan House BJP Mla) కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజాపై గెలుపొందారు.
సక్సేనాకు దారుల్ షఫా లోని 34బి నెంబర్ ఇల్లు కేటాయించారు సీఎం. ఆజమ్ ఖాన్ సభ్యత్వం రద్దు కాక ముందే ప్రభుత్వానికి చెందిన నివాసాన్ని రాంపూర్ నుంచి కొత్తగా ఎన్నికైన సక్సేనాకు కేటాయించడం కలకలం రేపింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయించినట్లు ఆ రాష్ట్ర శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఇదిలా ఉండగా విద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకు మూడేళ్ల జైలు శిక్ష అనుభవించారు ఆజం ఖాన్ . ఆ తర్వాత శాసనసభ రద్దు కావడానికి ముందు ఆ ఇంట్లో ఉన్నారు.
ఇదిలా ఉండగా ఆజం ఖాన్ ఉన్న ఇంటిని కేటాయించడంపై ఎస్పీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఖర్గే రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ – సీఎం