Babul Supriyo : టీఎంసీ స్పోక్స్ పర్సన్ గా బాబుల్ సుప్రియో
నియమించిన పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ
Babul Supriyo : ప్రముఖ బెంగాలీ సింగర్ , మాజీ కేంద్ర మంత్రిగా పని చేసి టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియోకు(Babul Supriyo) పదోన్నతి లభించింది. టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయనకు అరుదైన పోస్ట్ కు ఎంపిక చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా బాబుల్ సుప్రియోను నియమించారు. ఈ సందర్భంగా తనకు కొత్తగా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ చీఫ్ దీదీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతకు ముందు బాబుల్ సుప్రియో(Babul Supriyo) భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నారు.
కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న సమయంలో ఆయనను అర్ధాంతరంగా తొలగించింది బీజేపీ. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాబుల్ సుప్రీయో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆ వెంటనే తాను ఏ పార్టీతో గెలుపొందారో ఆ పార్టీ నుంచి తప్పు కోవడంతో ఎంపీ పదవికి రాజీనామా ప్రకటించారు. ప్రస్తుతం ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.
అదే సమయంలో ఎంపీ గా ప్రముఖ నటుడు శత్రఘ్ను సిన్హా గెలుపొందారు. తనపై నమ్మకం ఉంచి ఉన్నతమైన పదవిని అప్పగించినందుకు శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు బాబుల్ సుప్రియో.
ఇదిలా ఉండగా బాబుల్ సుప్రియోకు జాతీయ స్థాయిలో మంచి పట్టుంది. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలనే యోచనలో దీదీ ఉన్నారు.
అందుకే బాబుల్ కు జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందన్నారు పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు.
Also Read : కాళీ దేవి ఆశీస్సులు దేశానికి ఉన్నాయి