Babul Supriyo : రాజకీయ పక్షపాతానికి అతీతంగా ఎదగాలి
అమర్త్యసేన్ పై బాబుల్ సుప్రియో ఫైర్
Babul Supriyo : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా కొలువు తీరిన బాబుల్ సుప్రియో(Babul Supriyo) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచ ఆర్థిక వేత్తగా పేరొందిన భారత దేశానికి చెందిన అమర్త్య సేన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ఆర్థిక వేత్తగా ఆయనంటే తమకు గౌరవం ఉందని కానీ రాజకీయ పక్షపాతానికి అతీతంగా ఎదగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం బాబుల్ సుప్రియో మీడియాతో మాట్లాడారు.
తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అమర్త్యసేన్ తన రాజకీయ భావ జాలానికి మించి మరింత నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు.
ఇదే విషయాన్ని భారత దేవం కోరుకుంటోందన్నారు. కానీ అమర్త్య సేన్ ఆ వైపు ప్రయత్నం చేయడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత అయిన ఈ అరుదైన ఆర్థిక వేత్తపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాద్దాంతానికి, చర్చకు దారి తీసింది.
ఇదిలా ఉండగా అమర్త్య సేన్ తాను రాసిన హోమ్ ఇన్ ది వరల్డ్ – ఎ మెమోరియల్ పుస్తకానికి సంబంధించి ముజఫర్ అహ్మద్ స్మారక బహుమతిని అందుకున్నారు.
ఈ సందర్బంగా మంత్రి బాబుల్ సుప్రియో(Babul Supriyo) దీనిపై కామెంట్ చేశాడు. అమర్త్య సేన్ తన రాజకీయ సిద్దాంతాల నుండి బయటకు రాలేక పోతున్నాడని ఆరోపించారు.
అవార్డును స్వీకరించాలా లేదా అనేది అమర్త్య సేన్ నిర్ణయమని టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ పేర్కొనడం చర్చకు దారి తీసింది. కాగా దీనిపై ఇంకా స్పందించ లేదు ఆర్థికవేత్త సేన్.
Also Read : ఉద్దవ్ ఠాక్రే పై షిండే కామెంట్స్