Rana Kapoor Bail : యెస్ బ్యాంక్ మాజీ ఎండీకి బెయిల్
మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్
Rana Kapoor Bail : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన మనీ లాండరింగ్ కేసులలో ప్రధానమైన కేసుగా యెస్ బ్యాంకు నిలిచింది. ఈ కేసుకు సంబంధించి యెస్ బ్యాంకు మాజీ మేనేజింగ్ డైరెక్టర్ , సిఇఓ రాణా కపూర్ కు ఎట్టకేలకు బెయిల్(Rana Kapoor Bail) లభించింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది.
కేసుకు సంబంధించి తనకు బెయిల్ కావాలంటూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా కపూర్. సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుధీర్ కుమార్ జైన్ శుక్రవారం రాణా కపూర్ కు బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా రూ. 466. 51 కోట్ల మనీ లాండరింగ్ కేసులో యెస్ బ్యాంక్ మాజీ ఎండీ , సిఇఓ రాణా కపూర్ పాత్ర ఉన్నట్లు తేల్చారు. ఈ మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం విశేషం. ఈ కేసులో రాణా కపూర్ తో పాటు పలువురు ఉద్యోగులకు సంబంధించిన అవంత గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ థాపర్ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. గత ఏడాది అక్టోబర్ లో ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది.
ఈడీ తెలియ చేసిన వివరాల ప్రకారం అవంత రియాల్టీ లిమిటెడ్ , ఓయిస్టర్ బిల్డ్ వెల ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ గా ఉన్న గౌతమ్ థాపర్ పై ఈసీఐఆర్ నమోదు చేశారు.
2017 నుంచి 2019 మధ్య కాలంలో ప్రజా ధనాన్ని మళ్లించడం, దుర్వినియోగం చేశారు. ఇందులో భాగంగా నేర పూరిత విశ్వాస ఉల్లంఘన, మోసం, నేర పూరిత కుట్ర, ఫోర్జరీ చేశారంటూ ఈడీ ఆరోపించింది. ఈ మేరకు ఫిర్యాదులో ఇదే పేర్కొంది.
Also Read : కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్ర