Siddhanth Kapoor : డ్ర‌గ్స్ కేసులో సిద్దాంత్ కు బెయిల్

విడుద‌లైన న‌టి శ్ర‌ద్ధా క‌పూర్ సోద‌రుడు

Siddhanth Kapoor : బాలీవుడ్ న‌టి శ్ర‌ద్దా క‌పూర్ సోద‌రుడు, ప్ర‌ముఖ న‌టుడు శ‌క్తి క‌పూర్ కుమారుడు సిద్ధాంత్ క‌పూర్ కు ఊర‌ట ల‌భించింది. బెంగ‌ళూరులో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.

ఆదివారం రాత్రి న‌గ‌రంలో జ‌రిగిన ఓ పార్టీలో డ్ర‌గ్స్ సేవించినందుకు సిద్దాంత్ క‌పూర్(Siddhanth Kapoor) ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త బాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపింది.

ఇప్ప‌టికే దిగ్గ‌జ న‌టుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ఇదే విష‌యంలో అరెస్ట్ అయి చివ‌ర‌కు క్లీన్ చిట్ రావ‌డంతో ఊపిరి పీల్చుకున్నాడు కానీ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపుతోంది.

ఇదిలా ఉండ‌గా సిద్దాంత్ క‌పూర్ డ్ర‌గ్స్ సేవించిన‌ట్లు వైద్య ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డైంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఇక డ్ర‌గ్స్ సేవించిన ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్ కావ‌డంతో సోమ‌వారం ఆల‌స్యంగా సిద్దాంత్ క‌పూర్ కు ఆల‌స్యంగా బెయిల్ ల‌భించింది.

ఆయ‌న‌తో పాటు మిగ‌తా న‌లుగురు కూడా బెయిల్ పై విడుద‌లైన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి 35 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు చెప్పారు.

ఇదిలా ఉండ‌గా సిద్దాంత్ కపూర్(Siddhanth Kapoor) తో పాటు మ‌రో న‌లుగురు పోలీసులు ముందు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని తూర్పు బెంగ‌ళూరు డిప్యూటీ క‌మిష‌న‌ర్ భీమా శంక‌ర్ గుల్లెద్ తెలిపారు.

సిద్దాంత్ క‌పూర్ డ్ర‌గ్స్ సేవించిన‌ట్లు మెడిక‌ల్ రిపోర్ట్ లో తేలింది. అత‌డిని ఇప్ప‌టికే అరెస్ట్ చేశామ‌న్నారు. మిగ‌తా ప్ర‌క్రియ య‌ధావిధిగా కొన‌సాగుతుంద‌ని చెప్పారు. ప‌క్కా స‌మాచారం మేర‌కు ఎంజీ రోడ్డులో పార్టీ నిర్వ‌హిస్తున్న‌హోట‌ల్ పై దాడి చేశారు.

Also Read : నేత‌ల కామెంట్స్ కోర్టు సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!