Balkampet Bonalu : భక్త జనసందోహం ఎల్లమ్మ కళ్యాణోత్సవం
హాజరైన ప్రముఖులు..క్రిక్కిరిసన భక్తులు
Balkampet Bonalu : తెలంగాణ అంటేనే బోనాలకు ప్రసిద్ది. హైదరాబాద్ లో పేరొందిన బల్కంపేట రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఘనంగా, అంగరంగ వైభవంగా జరిగింది.
ఇసుక వేస్తే రాలనంత భక్త జనం తరలి వచ్చారు. అమ్మ వారిని దర్శించుకునేందు. ఆ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో నిండి పోయాయి.
ప్రత్యేక పూజలు చేపట్టారు రేణుక ఎల్లమ్మ తల్లికి. భాజా భజంత్రీల నడుమ తమిళనాడులోని మధురైలో ప్రత్యేకంగా తయారు చేసి తీసుకు వచ్చారు ఉత్సవ మూర్తులను. కళ్యాణ వేదిక వద్దకు తీసుకు వచ్చారు.
ఉదయం 11.45 గంటలకు కళ్యాణం జరిపించారు. ఇక రాష్ట్ర సర్కార్ తరపున మంత్రులు బల్కంపేట రేణుక ఎల్లమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక ఎప్పటి లాగే శివసత్తుల పూనకాలు, పోత రాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
నగరం నుంచే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. గతంలో కరోనా కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడింది.
ఇదిలా ఉండగా ఊహించని రీతిలో కనీసం 3 లక్షలకు పైగా భక్తులు బల్కంపేట ఎల్లమ్మను(Balkampet Bonalu) దర్శించుకునేందుకు, కళ్యాణోత్సవానికి వచ్చారని పోలీసులు భావిస్తున్నారు.
కాగా రథోత్సవం ఊరేగింపు పరిధిని మరింత పెంచారు. ఈసారి ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద మళ్లించేలా ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా పలువురు ప్రముఖులు ఒడి బియ్యం, చీరలు సమర్పించారు. జీటీఆర్ బంగారు నగల షాపు నిర్వాహకులు ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఇవాళ చివరి ఘట్టం రథోత్సవం కొనసాగుతుంది.
Also Read : ఘనంగా జగన్నాథ రథయాత్ర ఉత్సవం