Bandaru Dattatreya : మేకపాటిని కలిసిన దత్తన్న
పాత మిత్రుల ఆత్మీయుల కలయిక
Bandaru Dattatreya : హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తన పాత మిత్రుడు నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. గవర్నర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు.
Bandaru Dattatreya Meet his friend Mekapati Raja Mohan Reddy
హైదరాబాద్ లోని మేకపాటి నివాసంలో ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి పృద్వీ కుమార్ రెడ్డిలు గవర్నర్ దత్తాత్రేయకు ఆహ్వానం పలికారు.
ఈ సందర్బంగా మాజీ ఎంపీ మేకపాటి రాజ మోహన్ రెడ్డి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ(Bandaru Dattatreya) గత స్మృతులను నెమరు వేసుకున్నారు. గతంలో నెల్లూరు ఎంపీగా రెడ్డి పని చేశారు.
ఆ సమయంలో సికింద్రాబాద్ నుండి ఎంపీగా దత్తన్న పని చేశారు. ఆ సమయంలో పార్లమెంట్ లో ఇద్దరూ కీలకమైన అంశాలను లేవదీశారు. తమ మధ్య మైత్రీ బంధాన్ని పంచుకున్నారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తన్న నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ పార్టీ విషయాలను ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ది , సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను, కుటుంబ సభ్యుల గురించి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని, సోదరుడు పృథ్వీ కుమార్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.
Also Read : Praggnanandhaa : మోదీని కలిసిన ప్రజ్ఞానంద