Bandi Sanjay Aravind : అమాత్య పదవిని అందుకునేది ఎవరో
తెలుగు రాష్ట్రాల నుంచి ఛాన్స్ ఎవరికో
Bandi Sanjay Aravind : చాప కింద నీరులా ప్రజల్లోకి వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా దక్షిణాదిన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మరోసారి దేశంలో కాషాయ జెండా ఎగుర వేయాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.
ఈ మేరకు త్వరలోనే కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు ఉంటాయని, పని చేసే వారికి ఛాన్స్ ఇవ్వాలని ప్రధానమంత్రి , బీజేపీ రథ సారథి నిర్ణయించారు.
ఈ మేరకు అమిత్ షాతో పాటు పార్టీ చీఫ్ జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ , ఇతర సీనియర్లతో ఇప్పటికే భేటీ అయ్యారు. కానీ మోదీ మనసులో ఏముందో ఎవరికి తెలియదు ప్రకటించే దాకా. ఇక మంత్రుల పనితీరు ఆధారంగా చేసుకుని ఉంచాలా వద్దా అన్నది తేల్చేది మాత్రం బీఎల్ సంతోష్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇది పక్కన పెడితే రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్దం చేసింది బీజేపీ. ఇందులో భాగంగా త్వరలో జరిగే 9 రాష్ట్రాలలో విజయ దుందుభి మోగించాలని నిర్ణయించింది.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ధర్మపురి అరవింద్ , బండి సంజయ్ (Bandi Sanjay), సోయం బాపురావు, లక్ష్మణ్ పేర్లు ఉన్నాయి.
అయితే ఇప్పటికే లక్ష్మణ్ కు జాతీయ స్థాయిలో పదవిని కట్టబెట్టారు. ఇక కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా లభించింది. ఇంకో వైపు తెలంగాణలో పవర్ లోకి రావాలని ప్లాన్ చేస్తోంది. అందుకే ఇక్కడి వారికి ప్రయారిటీ ఇవ్వాలని పార్టీ ఆలోచన.
ఒకవేళ వీరిలో ఎవరికో ఒకరికి అప్పగిస్తే పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయనే దానిపై కూడా ఉత్కం నెలకొంది. ఏది ఏమైనా జాక్ పాట్ దక్కనుంది ఎవరికి అనేది త్వరలోనే తేలనుంది.
Also Read : సర్కార్ పై రైతన్నల కన్నెర్ర