Bandi Sanjay : జైల్లోనే బండి సంజయ్
విచారించనున్న హైకోర్టు
Bandi Sanjay Jail : భారతీయ జనతా పార్టీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 10వ తరగతి పేపర్ లీక్ కు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కరీంనగర్ కు తరలించారు. అక్కడి జైల్లోని గోదావరి బ్యారక్ లో బండి సంజయ్(Bandi Sanjay Jail) ను ఉంచారు. బీజేపీ స్టేట్ చీఫ్ తో పాటు మరికొందరిని కూడా తరలించారు.
ఎంపీకి ఖైదీ నెంబర్ 7917 ను కేటాయించారు జైలు సూపరింటెండెంట్ . ఇదిలా ఉండగా ఎంపీ బండి సంజయ్ ను కలిసేందుకు వచ్చారు ఆయన కుటుంబీకులు. అయితే జైలర్ మాత్రం అనుమతి ఇవ్వలేదంటూ ఆరోపించారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన జైలు వద్దకు భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు తరలి వచ్చారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరో వైపు ఎంపీ బండి సంజయ్ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల కస్టడీ తీసుకోవడంపై గురువారం విచారణ జరగనుంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై జైలులోనే ఉంటారా లేక బెయిల్ వస్తుందా అన్నది తేలనుంది.
బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసిన పిటిషన్ దాఖలు చేయగా ఇంకో వైపు బండి సంజయ్ ని(Bandi Sanjay) కస్టడీ కోరుతూ వరంగల్ పోలీసులు పిటిషన్ వేయడం విశేషం. తమకు మొబైల్ ఫోన్ ఇవ్వలేదని , ఫోన్ డేటాతో పాటు లీకేజీ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని , అందుకే కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు.
Also Read : ఏ1గా బండి సంజయ్ – సీపీ