Bandi Sanjay : ఏపీ ఇంఛార్జ్ గా బండికి ఛాన్స్..?
హైకమాండ్ పరిశీలనలో
Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బండి సంజయ్ కుమార్ కు మరో కీలక పదవి కట్టబెట్టేందుకు పార్టీ హై కమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంఛార్జ్ గా నియమించనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ఇంఛార్జ్ గా సునీల్ దేవ్ ధర్ ను తప్పించింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
Bandi Sanjay Position
పార్టీ పరిశీలకుడు బీఎల్ సంతోష్ ప్రస్తుతం పదవుల మార్పు వెనుక ఉన్నట్లు టాక్. తెలంగాణలో బీజేపీకి ఊహించని రీతిలో మైలేజ్ తీసుకు వచ్చిన ఘనత బండి సంజయ్(Bandi Sanjay) ది. ప్రస్తుతం ఆయనకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డికి బీజేపీ పదవీ బాధ్యతలు అప్పగించింది. గతంలో కూడా ఆయన పార్టీ చీఫ్ గా ఉన్నారు.
ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని, స్టేట్ చీఫ్ పదవి నుంచి తప్పించిన బండికి కిషన్ రెడ్డిని తప్పించి కేబినెట్ లో ఛాన్స్ ఇస్తారని అంతా భావించారు. కానీ బిగ్ షాక్ ఇస్తూ కేవలం పార్టీ పదవికే పరిమితం చేసింది. ఈ తరుణంలో ఏపీ రాష్ట్రానికి కీలక బాధ్యతలు అప్పగించింది పార్టీ దగ్గుబాటి పురందేశ్వరికి. మొత్తంగా బండి రాకతో ఏపీకి చికిత్స చేస్తాడా అన్నది వేచి చూడాలి.
Also Read : Nora Fatehi : కావాలని నన్ను ఇరికించారు – నోరా