Bandi Sanjay : యాదగిరిగుట్టలో ‘బండి’ ప్రమాణం
దమ్ముంటే సీబీఐతో విచారణ చేపట్టాలి
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్(Bandi Sanjay) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తమ పార్టీపై లేని పోని ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. తాము ఒక్క పైసా ఎవరికీ ఇవ్వలేదని, ఆ అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న రూ. 100 కోట్ల డీల్ అంతా బక్వాస్ అని ఆరోపించారు. ఇదంతా తప్పు అని దమ్ముంటే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి గుడి వద్దకు రావాలని, ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు బండి సంజయ్. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నారు.
గుట్టలోని స్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. గర్బ గుడి ముందు నిల్చుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో ఎలాంటి ప్రమేయం లేదంటూ ప్రమాణం చేశారు. తాను విసిరిన సవాల్ ను స్వీకరించ లేదన్నారు మండిపడ్డారు.కేసీఆర్ ఎందుకు తన సవాల్ ను స్వీకరించలేదని ప్రశ్నించారు.
తనను వెళ్లకుండా అడ్డు కోవడం సీఎం కేసీఆర్(CM KCR) అని ఆరోపించారు. ముందు ఆ వందల కోట్లు ఎక్కడికి వెళ్లాలని నిలదీశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం దారుణమన్నారు బండి సంజయ్. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తప్పు చేశారు కాబట్టే యాదగిరిగుట్టకు రాలేదని మండిపడ్డారు బండి సంజయ్ కుమార్ పటేల్.
తమకు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనే అవసరం లేదన్నారు. అలా కొనుగోలు చేయాలని అనుకుంటే ముందు తమ పదవులకు రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.
Also Read : బీజేపీ నేతల మాటలన్నీ బక్వాస్ – కేటీఆర్