Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ , భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ హై కమాండ్ బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ పటేల్ ను మార్చింది. రాష్ట్ర బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. మరింత దూకుడుగా వ్యవహరిస్తున్న బండిని ఎందుకు తప్పించారనే దానిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి.
Bandi Sanjay Meet
బండిని తప్పించి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఉన్నట్టుండి బండిని మార్చడం మింగుడు పడడం లేదు.
ఈ తరుణంలో బండి పార్టీలో ట్రబుల్ షూటర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిషన్ రెడ్డి ఏ మేరకు పార్టీని ముందుకు తీసుకు వెళతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇదే సమయంలో పార్టీలో కీలక మార్పులు చేసింది. ఈటల రాజేందర్ కు రాబోయే ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించింది. ఆయనతో పాటు మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది.
Also Read : Vijay Sethupathi First Look : విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ కిర్రాక్