Bandi Sanjay Modi : మోడీని క‌లిసిన బండి కుటుంబం

ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన ప్ర‌ధాని

Bandi Sanjay Modi : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ తెలంగాణ బీజేపీ చీఫ్‌, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్(Bandi Sanjay) గురువారం ఢిల్లీలో కుటుంబ స‌మేతంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ నివాసానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా త‌న భార్య‌, కొడుకుల‌ను మోదీకి ప‌రిచ‌యం చేశారు. బండి ఫ్యామిలీని ఆప్యాయంగా ప‌ల‌కరించారు న‌రేంద్ర మోదీ. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Bandi Sanjay Modi Meet

అంతే కాదు కుమారుల‌ను ఏం చదువ‌కుంటున్నార‌ని అడిగారు. వారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. భ‌విష్య‌త్తులో ఉన్న‌త స్థానాల్లోకి రావాల‌ని సూచించారు. భార‌తీయ సంస్కృతి , సంప్ర‌దాయాల‌ను మ‌రిచి పోవ‌ద్ద‌ని , నిత్యం ప‌ఠ‌నం అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.

ప్ర‌ధాన మంత్రి మోదీ త‌మ‌కు టైం ఇవ్వ‌డ‌మే కాకుండా ఆప్యాయంగా ప‌ల‌క‌రించ‌డం తో బండి భార్య‌, పిల్ల‌లు సంతోషానికి లోన‌య్యారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో పార్ల‌మెంట్ స‌మావేశాలు వాడి వేడిగా జ‌రుగుతున్నాయి. ఈ త‌రుణంలో ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ బండి ప‌ట్ల ఉన్న ప్రేమ‌, అభిమానం కార‌ణంగా వెంట‌నే త‌న‌ను క‌లిసేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు మోదీ. మొత్తంగా బండి ఫ్యామిలీ భ‌లే ఖుష్ అయ్యింది.

ఇదిలా ఉండ‌గా బండి సంజ‌య్ ఎంపీగా గెలిచినా ఆయ‌న పార్టీ స్టేట్ చీఫ్ అయ్యాకే పాపుల‌ర్ అయ్యారు. ఎక్క‌డో ఉన్న బీజేపీకి ఒక ఊపు తీసుకు వ‌చ్చారు. మ‌రో వైపు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌త‌రుణంలో ఉన్న‌ట్టుండి బండిని త‌ప్పించింది హై క‌మాండ్.

Also Read : MP Avinash Reddy : బాబు తాను పులిన‌ని అనుకుంటే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!