Bandi Sanjay : పార్టీ ఆఫీసుకు బండి సంజయ్ తరలింపు
బయటకు రాకుండా ఖాకీలు కట్టుదిట్టం
Bandi Sanjay : మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇరు పార్టీలు పోటా పోటీగా ఖర్చు చేశాయి. డబ్బులతో పాటు విచ్చలవిడిగా మద్యాన్ని అధికార పార్టీ వాళ్లు పంపిణీ చేశారంటూ భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు.
ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం స్థానికేతరులు ఎవరూ అక్కడ ఉండకూడదని కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర ప్రాంతాల వారంతా మకాం వేశారంటూ ఆరోపించారు స్టేట్ చీఫ్. తాను మునుగోడుకు వెళతానంటూ బయలు దేరారు. దీంతో బండి సంజయ్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
రాత్రి హౌజ్ అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడే ఉంచారు. ఇవాళ ఉదయం అక్కడి నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ఆఫీసు నుండి బయటకు రాకుండా కాపలా కాస్తున్నారు. పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటి వరకు 3 వేల మంది పోలీసులతో పాటు 20 కేంద్ర బలగాలను మోహరించారు. ఇక తనను బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం అనేది కుట్రలో భాగమేనంటూ ఆరోపించారు బండి సంజయ్ కుమార్ పటేల్. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ దాడులకు, ప్రలోభాలకు భయపడకుండా పోలింగ్ సజావుగా సాగేలా కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అర్దరాత్రి సమయంలో బయలు దేరేందుకు యత్నించిన బండిని రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద అడ్డుకుని లోపల వేశారు.
Also Read : మునుగోడులో ఎగిరే జెండా ఎవరిదో