Bandi Sanjay : ఇకనైనా ఫిర్యాదులు ఆపండి – బండి
ఈటలపై పంచులు విసిరిన మాజీ చీఫ్
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం బీజేపీ నూతన చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు జి. కిషన్ రెడ్డి. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో మాజీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడారు. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఈటల రాజేందర్ పై పంచులు విసిరారు. ఇక నుంచైనా ఢిల్లీకి వెళ్లడం మానుకోవాలని, ఫిర్యాదులు చేయొద్దంటూ కోరారు. తప్పుడు రిపోర్టులు ఇవ్వవద్దని కోరారు. పార్టీని నమ్ముకున్న వారిని ఇబ్బందులు చేయొద్దని అన్నారు.
Bandi Sanjay Comments
గంగాపురం కిషన్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు. ఆయన నమ్మిన సిద్దాంతం కోసం పని చేసే వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయననైనా ఇక నుంచి ప్రశాంతంగా పని చేసుకునేలా చేయాలని సూచించారు బండి సంజయ్(Bandi Sanjay). తప్పుడు ఫిర్యాదులు ఇవ్వకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేయాలన్నారు.
ప్రస్తుతం బండి సంజయ్ చేసిన కామెంట్స్ బీజేపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రెండు వర్గాలుగా చీలి పోయినట్లు ఆరోపణలున్నాయి. దీంతో పార్టీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బండిని తప్పించింది. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఆపై రాజ గోపాల్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. కిషన్ రెడ్డికి పార్టీ చీఫ్ గా ఛాన్స్ ఇచ్చింది. మొత్తంగా బండి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఈటలను ఉద్దేశించి అన్నట్లు అర్థమవుతోంది.
Also Read : Telangana BJP Tribute : ‘కమలం’ అమరులకు వందనం