Bandi Sanjay : దొరకు మహిళలంటే చులకన – బండి
బీఆర్ఎస్ తీరుపై భగ్గుమన్న బీజేపీ చీఫ్
Bandi Sanjay : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపిస్తూ మంగళవారం భారత రాష్ట్ర సమితికి చెందిన ఎంపీలు రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ .
ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం తప్ప మరొకటి కాదన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గు చేటుగా అభివర్ణించారు. ఆమెను అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని కూడా అవమానించినట్లేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో గవర్నర్ ను దేశంలో రాష్ట్రపతి పట్ల కావాలని సీఎం కేసీఆర్ ఇలా వ్యవహరించేలా చేస్తున్నాడని ఆరోపించారు బండి సంజయ్.
ద్రౌపది ముర్ము రాజకీయ నాయకురాలు కాదన్న విషయం కూడా భారత రాష్ట్ర సమితి పరివారానికి తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. దొరనేమో ఫామ్ హౌస్ లో పండుకుంటే ఇక దేశం గురించి, పాలనా వ్యవస్థ గురించి ఎలా అర్థం అవుతుందని ప్రశ్నించారు బండి సంజయ్ . సీఎంకు మహిళలంటే గౌరవం లేదని ఆయనకు తన కూతురు తప్ప దేశంలో ఎవరి పట్ల కరుణ, ప్రేమ ఉండదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్(Bandi Sanjay) .
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. మహిళా గవర్నర్ ను అవమానించి చివరకు కోర్టుకు వెళ్లారని అక్కడ కూడా అభాసు పాలయ్యారని ఎద్దేవా చేశారు.
Also Read : సిద్దరామయ్య అంటే గౌరవం – మంత్రి