Bandi Sanjay : కేసీఆర్ హామీలు నీటి మూట‌లు – బండి

జ‌నం న‌వ్వుకుంటార‌ని ఎద్దేవా

Bandi Sanjay : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ , క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు సీఎం కేసీఆర్ పై. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఏం సాధించారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. సీఎంకు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. తాను ఇచ్చిన హామీల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు చూసి జ‌నం న‌వ్వుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు బండి సంజ‌య్(Bandi Sanjay).

బీజేపీ చీఫ్ సీఎం ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీల చిట్టాను విప్పారు. వీటికి ద‌మ్ముంటే స‌మాధానం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. క‌రీంన‌గ‌ర్ ను లండ‌న్ గా , వ‌రంగ‌ల్ ను వాషింగ్ట‌న్ గా, హైద‌రాబాద్ ను డ‌ల్లాస్ గా, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్గ ఆ మారుస్తాన‌ని చెప్పార‌ని గుర్తు చేశారు. ఇవి ఎక్క‌డున్నాయ‌ని ప్ర‌శ్నించారు. ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని జ‌నం సాక్షిగా చెప్పాడ‌ని కానీ మ‌రిచి పోయాడ‌ని మండిప‌డ్డారు.

ద‌ళితుల‌కు మూడు ఎక‌రాలు ఇస్తాన‌ని చెప్పిండు. మోసం చేసిండ‌ని ఆరోపించారు బండి సంజ‌య్. రైతుల‌కు రుణ మాఫీ చేస్తాన‌ని , పంట‌ల‌కు బీమా వ‌ర్తింప చేస్తాన‌ని చెప్పిన మాట ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. నిజాం షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని పునః ప్రారంభిస్తామ‌ని అన‌లేదా అంటూ కేసీఆర్ ను నిల‌దీశారు. నిరుద్యోగ భృతి , పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూం ఏమైంద‌ని ప్ర‌శ్నించారు బండి సంజ‌య్. అవినీతి ర‌హిత తెలంగాణ అని చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలేనంటూ ఆరోపించారు.

Also Read : RS Praveen Kumar :కేసీఆర్ డీజేపీ ఏం త్యాగం చేశారు

Leave A Reply

Your Email Id will not be published!