Bandi Sanjay : ఆర్టీసీని నిర్వ‌ర్యం చేసిన కేసీఆర్

బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

Bandi Sanjay : మిగులు బ‌డ్జెట్ తో ఉన్న తెలంగాణ‌ను అప్పుల కుప్ప‌గా చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ దేన‌ని పేర్కొన్నారు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి బండి సంజ‌య్(Bandi Sanjay). ఆర్టీసీని స‌ర్వ నాశ‌నం చేసింది కాక ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని కొత్త నాట‌కానికి తెర లేపాడంటూ ఆరోపించారు. ఇది ఆర్టీసీ సంస్థ‌పై ప్రేమ‌తో కాద‌ని కేవ‌లం ఆ సంస్థ‌కు చెందిన ల‌క్ష కోట్ల విలువ చేసే స్థ‌లాల‌పై క‌న్నేశాడంటూ మండిప‌డ్డారు. గ‌తంలో ఇదే సంస్థ‌పై ప్రేమ ఉంటే ఎప్పుడో ఆర్టీసిని విలీనం చేసే వార‌ని అన్నారు బండి సంజ‌య్.

Bandi Sanjay Comments

ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌న్న కేసీఆర్ ప్ర‌క‌ట‌న న‌మ్మ‌శ‌క్యంగా లేద‌న్నారు . కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా అది రాజ‌కీయ కోణం త‌ప్ప మాన‌వీయ కోణం ఉండ‌ద‌ని మండిప‌డ్డారు. చివ‌ర‌కు ఆర్టీసీ కార్మికుల‌కు కూడా దీనిని న‌మ్మ‌లేక పోతున్నార‌ని ఎద్దేవా చేశారు.

ఇవాళ ప్ర‌భుత్వం వ‌ద్ద ఏం ఉంద‌ని గొప్ప‌లు చెబుతున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. ఖ‌జానా మొత్తం ఖాళీ అయ్యింద‌ని, జ‌వాబుదారీగా ఉండాల్సిన ప్ర‌భుత్వం స్థ‌లాల‌ను వేలం పాట వేసే ప‌ని చేప‌డుతోంద‌న్నారు. ఇలాంటి స‌ర్కార్ ను తాము ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను మాయ మాట‌ల‌తో బురిడీ కొట్టించ‌డం కేసీఆర్ కు వెన్న‌తో పెట్టిన విద్య అని మండిప‌డ్డారు.

Also Read : MLA Seethakka : వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోండి

Leave A Reply

Your Email Id will not be published!