Bandi Sanjay : మోదీ అంటే భయం కేసీఆర్ ఆగమాగం
నీ ఇంట్లో..పార్టీలోనే ఏక్ నాథ్ షిండేలు
Bandi Sanjay : సీఎం కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు.
కేసీఆర్ మాట్లాడిన మాటలు సీఎం స్థాయికి తగినట్లుగా లేవన్నారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పదే పదే మరాఠాను తలుచుకుని మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశాడు.
ఆయన ఇంట్లోనే కాదు పార్టీలోనూ కొంత మందితో పొసగడం లేనట్టుందన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అందుకే లోలోపట తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ కు లోనవుతున్నాడని పేర్కొన్నారు బండి సంజయ్(Bandi Sanjay).
తాము నిజాయితీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. కావాలని అనుకుంటే, చక్రం తిప్పాలని అనుకుంటే సీఎం పదవి తీసుకుని ఉండే వాళ్లమన్నారు. కానీ డిప్యూటీ సీఎం పదవికే పరిమితమైనట్లు చెప్పారు.
తమ పార్టీకి చెందిన నేతల్ని పదే పదే దూషించడం అలవాటుగా కేసీఆర్ కు మారిందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
ఇప్పటికే దొరల గడీల పాలనకు జనం చరమగీతం పాడే రోజు తప్పకుండా వస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రాష్ట్రాన్ని మరో నిజాం పాలనగా మార్చేసిన సీఎంకు మాట్లాడే అర్హత లేదన్నారు బండి సంజయ్.
ప్రగతి భవన్ పై కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు. ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీకి తిరుగే లేదన్నారు. పాలన చేతకాక, ప్రజలకు జవాబు చెప్పలేక కేసీఆర్ బీజేపీపై బురద చల్లుతున్నారంటూ ఆరోపించారు.
Also Read : ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా – కేసీఆర్