Bandi Sanjay : కొత్త నాటకానికి తెర లేపిన సీఎం – బండి
ఆపరేషన్ ఆకర్ష్ విఫలం పూర్తి బక్వాస్
Bandi Sanjay : టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ గుట్టు రట్టుపై మాటల తూటాలు పేలుతున్నాయి. తన ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో సీఎం కేసీఆర్(CM KCR) చేసిన ప్రయత్నం అని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్.
విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ కు సమీపంలోని మోయినాబాద్ ఫామ్ హౌస్ అధికార పార్టీకి చెందిన వారిదన్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్దాలని ధ్వజమెత్తారు.
బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మనుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ ఎమ్మెల్యే గెలవరని అర్థమై పోయిందని, దీంతో పరువు పోకుండా కాపాడుకునేందుకే ఇలా కేసీఆర్ నాటకాలకు తెర లేపారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఆపరేషన్ ఆకర్ష్ కు ప్లాన్ చేసింది సీఎం అని మండిపడ్డారు. దీనికి ఢిల్లీలో స్కెచ్ వేశారని ఫైర్ అయ్యారు. ముందు తన వద్దకు ఎవరెవరు వచ్చారనే దానిపై సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు.
నెత్తి మీద వంద రూపాయలు పెడితే ఎవరూ కొనని ఎమ్మెల్యేలను ఎవరు కొనుగోలు చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు బండి సంజయ్. ఈ స్క్రిప్టు రాసిందంతా కేసీఆర్ అని ధ్వజమెత్తారు.
ఇక నుంచైనా నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు బీజేపీ చీఫ్. మరో వైపు దీనిపై సీరియస్ గా స్పందించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.
Also Read : ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ బక్వాస్