Bandi Sanjay : ఆ నలుగురి చేతుల్లో తెలంగాణ బందీ
ఉద్యమ ద్రోహులకు అందలం
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) నిప్పులు చెరిగారు. ఎందరో బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరైనా చని పోయారా అని ప్రశ్నించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యమంలో ఊపిరి ఆగి పోయిన వాళ్ల గురించి ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో మాడి మసై పోయిన శ్రీకాంతా చారి, నరసింహ లాంటి వాళ్ల త్యాగాలను ఇవాళ గుర్తు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు.
త్యాగం కొందరిదైతే భోగం కల్వకుంట్ల కుటుంబం అనుభవిస్తోందని ఆరోపించారు బండి సంజయ్. సంబండ వర్ణాలను చంపేసి సకల సంబురాలు జరుపుకునే హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు. నాలుగు కోట్ల ప్రజలు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ నలుగురి చేతుల్లో తెలంగాణ బందీ అయి పోయిందని ధ్వజమెత్తారు.
నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ పేరుతో సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు దిక్కు లేనిదైందని , దోపిడీలకు, అక్రమార్కులకు, అవినీతి పరులకు అడ్డాగా మారి పోయిందని ఆరోపించారు బీజేపీ చీఫ్. బానిస బతుకులు వద్దని పోరాడితే చివరకు నీ బాంఛన్ దొర అనే స్థితికి చేరుకునేలా చేశాడంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బండి సంజయ్. కాకతీయుల రాజ్యం వస్తుందని అనుకుంటే కల్వకుంట్ల రాజ్యం ఏర్పడిందన్నారు.
Also Read : Arvind Kejriwal