Bandi Sanjay : కాంగ్రెస్ దుష్ప్రచారం అబద్దం – బండి
బీఆర్ఎస్ , కాంగ్రెస్ పొత్తు నిజం
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదే పదే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారంపై భగ్గుమన్నారు. ఇది మంచి పద్దతి కాదని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సిగ్గు లేకుండా ఎలా ప్రచారం చేస్తారంటూ ప్రశ్నించారు బీజేపీ చీఫ్. ఉప ఎన్నికల్లో ఆ పార్టీని ఆదరించ లేదని ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తు చేశారు. ఆ పార్టీ నుంచి గెలుపొందని ఎమ్మెల్యేలు జంప్ అయ్యారని, 19 మందిలో 12 మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారోనని.
రాబోయే రోజుల్లో తాము పవర్ లోకి వస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు బండి సంజయ్(Bandi Sanjay) కుమార్. వచ్చిన వెంటనే సింగరేణికి ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పారు. దానిని ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓపెన్ కాస్టులను ఓ వైపు రద్దు చేస్తున్నామని చెబుతూనే మరో వైపు పర్మిషన్స్ ఎలా తెచ్చుకుంటారంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ సింగరేణిని దివాలా తీసేలా చేసిందని ఆరోపించారు. ఇప్పటికే రూ. 25,000 కోట్ల రుణం తీసుకుందని చెప్పారు. జీతాలు చెల్లించేందుకు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు బీజేపీ చీఫ్. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు.
Also Read : Etala Rajender : కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకో
