Bandi Sanjay : చీకటి రోజులకు తెర లేపిన దినం
నిప్పులు చెరిగిన బీజేపీ చీఫ్ బండి
Bandi Sanjay : సరిగ్గా ఇదే రోజు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజు జూన్ 25. ఇవాల్టితో సరిగ్గా 38 ఏళ్లవుతోంది. దీనికి ఆద్యురాలు ఆమె అంటూ నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్. ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. నియంతృత్వపు చీకటి రోజులకు తెర లేపిన దినం. ప్రజాస్వామ్యపు ఆకాంక్షలు, స్వేచ్చ కోసం పోరాటాలు మొదలైన రోజు ఇవాళ అని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలను నర నరాన జీర్ణించుకున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు బహిర్గతమైంది కూడా ఈ ఎమర్జెన్సీ విధింపుతోనేనని పేర్కొన్నారు బండి సంజయ్(Bandi Sanjay) .
ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటాల స్పూర్తితో సైద్దాంతిక పునాదులతో ఆనాటి త్యాగ మూర్తులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు బీజేపీ చీఫ్. ఇదిలా ఉండగా 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు జాతీయ అంతర్గత అత్యవసర స్థితిని విధించారు ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ. 21 నెలల పాటు చీకటి రోజుల్లో బతికింది భారత దేశం. భారత రాజ్యాంగం లోని 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఆనాటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా జూన్ 25 అర్ధరాత్రి 11.45 నిమిషాలకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ రోజును యావత్ దేశమంతా ఎమర్జెన్సీగా గుర్తించింది. ఇది ఒక రకంగా నియంతృత్వపు పోకడలకు ఉదాహరణ. కానీ ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే ఇందిరను తిట్టారో ఆ ప్రజలే బ్రహ్మరథం పట్టారు.
Also Read : Raghav Chadha : రాజ్ నాథ్ పై రాఘవ్ చద్దా గరం