Bandi Sanjay : పగటి కలలు కంటున్న కాంగ్రెస్ – బండి
రాబోయే ఎన్నికల్లో కాషాయానిదే పవర్
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడి పోయామన్న సంగతి మరిచి పోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేతలు పగటి కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్.
నేరం, అవినీతిమయం, కళంకిత రాజకీయ నాయకులు ఆ పార్టీలో ఉన్న వారు గాలిలో కోటలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు . కర్టాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలకు చుక్కలు చూపిస్తోందన్నారు. హిందువులకు వ్యతిరేకంగా ఉన్న మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. హెడ్డేవార్ , వీడి సావర్కర్ లాంటి దేశ భక్తుల చరిత్ర నుంచి తీసి వేసిందని వాపోయారు.
రాహుల్ గాంధీ నాటకం తర్వాత కర్ణాటకలో ఇప్పుడు అదానీ గ్రూప్ నుండి పెట్టుబడులు ఆహ్వానిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్(Bandi Sanjay). ఒక వైపు పెన్షన్లు, ధరణి, సంక్షేమ పథకాలపై తెలంగాణ లో అనిశ్చితి సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు . మరో వైపు బీఆర్ఎస్ పవర్ లోకి రాకుంటే పథకాలన్నీ ఆగి పోతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సామాజిక భదత్రా పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అన్ని లోపాలను సరిదిద్ది ప్రజలకు ఉపయోగపడేలా పని చేస్తామని తెలిపారు.
Also Read : Adipurush Record : వసూళ్లలో ఆది పురుష్ రికార్డ్