Bandi Sanjay : ప్రశ్నిస్తే దాడులు చేస్తారా – బండి సంజయ్
ఎంపీ అరవింద్ కు ఫోన్ లో పరామర్శ
Bandi Sanjay : అధికారంలో ఉన్నామని పేట్రేగి పోతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం. ఆరోపణలు చేస్తే నిరూపించు కోవాలి. కానీ దాడులకు పాల్పడతారా అంటూ నిలదీశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) .
శుక్రవారం టీఆర్ఎస్ శ్రేణులు కొందరు భారతీయ జనతా పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలుసుకున్న బండి సంజయ్ ఎంపీకి ఫోన్ చేశారు. విషయం ఏం జరిగిందనే దానిపై ఆరా తీశారు.
ఎంపీ ఇంటిపై దాడికి దిగడం పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. మరి ప్రశ్నించే వాళ్లను టార్గెట్ చేస్తూ పోతారా అని నిలదీశారు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay). ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొనే దమ్ము లేకనే ఇలాంటి భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.
దీనిని తాము పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రౌడీ యిజం నడుస్తోందన్నారు. రాచరిక పాలనకు పరాకాష్టగా కేసీఆర్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు ప్రగతి భవన్ నుంచి బయటకు వెళ్లగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు.
దమ్ముంటే ప్రజాస్వామ్యయుతంగా బరిలో నిలిచి కొట్లాడాలని కానీ పిరికిపందల్లా నివాసాలపై దాడులకు దిగడం ఏమిటంటూ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే , కలేజా ఉంటే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు గనుక రంగంలోకి దిగితే తట్టుకోలేరని హెచ్చరించారు.
Also Read : బీజేపీ ఆఫర్ డోంట్ కేర్ – కల్వకుంట్ల కవిత