Bandi Sanjay : ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం
శ్రీకారం చుట్టిన కాషాయం
Bandi Sanjay : తెలంగాణ రాష్ట్రంలో తామే అసలైన ప్రత్యామ్నాయం అని చెప్పేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. అయితే జనంలో మాత్రం బీఆర్ఎస్ కు బీజేపీ బి టీం లాగా పని చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని విమర్శలు లేక పోలేదు. ఇదిలా ఉండగా త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పల్లెల నుంచి పట్టణాల దాకా పార్టీని బలోపేతం చేయడంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫోకస్ పెట్టారు.
ఇందులో భాగంగా గురువారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను బీజేపీకి చెందిన కార్యకర్తలు, నాయకులు , బాధ్యులు కలుసుకుంటారని స్పష్టం చేశారు బీజేపీ చీఫ్. కాగా బండి సంజయ్(Bandi Sanjay) మొదలు పోలింగ్ బూత్ అధ్యక్షుల వరకు ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికీ బీజేపీ పేరుతో కలుస్తారని తెలిపారు.
ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాము పవర్ లోకి వస్తామన్నారు. ఒక్కో కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ బూత్ లో కనీసం 100 కుటుంబాల వద్దకు వెళతారని , నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలన గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తారన్నారు.
Also Read : Leo First Look : విజయ్ లియో ఫస్ట్ లుక్ కిర్రాక్