Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం మహా శక్తి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూజారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మ వారికి పూలు చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మహా శక్తి అమ్మ వారిని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. అమ్మ దయ ఉంటే ఇక అన్నీ ఉన్నట్టేనని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా బండి సంజయ్(Bandi Sanjay) పక్కా హిందుత్వ వాది. ఆయన చిన్నప్పటి నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం అంచెలంచెలుగా కార్యకర్త నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్ గా పని చేశారు. కార్పొరేటర్ గా గెలుపొందారు. కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా సక్సెస్ అయ్యారు. బీజేపీకి ఊపు తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఉన్నట్టుండి తన పదవిని కోల్పోయారు. బండిని తప్పించింది పార్టీ హైకమాండ్. ఆయన స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
ఇక బండి సంజయ్ కి చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆలయాలను సందర్శించు కోవడం ఆనవాయితీ. తాజాగా మహా శక్తి ఆలయాన్ని దర్శించకున్నారు.
Also Read : Haryana CM : 24 గంటలు బార్లు ఓపెన్ – సీఎం
