Bangarraju Trailer : బంగార్రాజు మూవీ ట్రైల‌ర్ రిలీజ్

తండ్రీ కొడుకుల పోటా పోటీ న‌ట‌న

Bangarraju Trailer  : అక్కినేని నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ గ‌తంలో న‌టించిన సోగ్గాడే చిన్నినాయినా మూవీ స‌క్సెస్ కావ‌డంతో దానికి సీక్వెల్ గా బంగార్రాజు మూవీ వ‌స్తోంది.

ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌త్యానంద్ తో స‌హ ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ఈ కొత్త సినిమాకి. నేచుర‌ల్ డ్రామాగా దీనిని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్. అన్న‌పూర్ణ స్టూడియోస్ , జీ స్టూడియోస్ క‌లిసి నిర్మించాయి.

తాజాగా బంగ‌ర్రాజు చిత్రంలో అక్కినేని నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌, అక్కినేని నాగ చైత‌న్య‌, కృతి శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా స్పెష‌ల్ సాంగ్ లో ఫ‌రియా అబ్దుల్లా దుమ్ము రేపింది.

ఈనెల 14న సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి ఇవాళ బంగర్రాజు మూవీ ట్రైల‌ర్(Bangarraju Trailer )రిలీజ్ చేశారు. ఇక సోగ్గాడే చిన్ని నాయినా మూవీ 2016లో విడుద‌లైంది.

ఇక సినిమాలో బంగార్రాజుగా అక్కినేని నాగార్జున‌, చిన్న బంగార్రాజుగా నాగ చైత‌న్య‌, స‌త్య‌భామ‌గా ర‌మ్య‌కృష్ణ‌, నాగ‌ల‌క్ష్మిగా కృతి శెట్టి, రావు ర‌మేష్ , బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ , ఝాన్సీ, అనిత చౌద‌రి, సీర‌త్ క‌పూర్ , మీనాక్షి దీక్షిత్ , ద‌ర్శ‌న బానిక్ న‌టించారు.

వీరితో పాటు వేదిక‌, దక్ష నాగ‌ర్క‌ర్ అతిథి పాత్ర‌ల్లో న‌టించారు. తాజాగా బంగార్రాజు మూవీకి సంబంధించి విడుద‌లైన ట్రైల‌ర్ కు భారీ స్పంద‌న ల‌భిస్తోంది.

క‌రోనా క‌ల‌క‌లం ఇరు తెలుగు రాష్ట్రాల‌లో రేపుతున్న‌ప్ప‌టికీ కొన్ని సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. కాక పోతే బంగార్రాజు మూవీ మాత్రం చెప్పిన విధంగానే సంక్రాంతికి రానుంద‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Also Read : ప్రిన్స్ ‘బిజినెస్ మేన్’ కు ప‌దేళ్లు

Leave A Reply

Your Email Id will not be published!