Sheikh Hasina : భారత్ తో బంగ్లా చిరకాల స్నేహం – హసీనా
మోదీ అందించిన సహకారం మరువలేం
Sheikh Hasina : భారత దేశంతో మాకు చిరకాల స్నేహం ఉందని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) స్పష్టం చేశారు. దేశ పర్యటనలో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక ప్రయోజనాలపై చర్చించారు. రాష్ట్రపతి భవన్ లో సమావేశమైన అనంతరం షేక్ హసీనా మాట్లాడారు. ఢిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాన మంత్రికి కేంద్ర జౌళి, రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోష్ స్వాగతం పలికారు.
అంతే కాకుండా దేశ రాజధాని లోని ప్రముఖ యాత్రా స్థలాలైన నిజాముద్దీన్ ఔలియా దర్గాను సందర్శించారు. నైబర్ హుడ్ ఫస్ట్ విధానంలో బంగ్లాదేశ్ కీలక భాగస్వామిగా ఉంది.
మోదీ, షేక్ హసీనా నాయకత్వంలో భారతదేశం, బంగ్లాదేశ్ దేశాలు భూమి, సముద్ర సరిహద్దుల విభజన, భద్రత, కనెక్టివిటీ, అభివృద్ది సహకారం, సాంస్కృతిక మార్పిడి, శక్తి, వాణిజ్యం, బ్లూ ఎకానమీ, రక్షణ వంటి రంగాలలో భాగస్వామిగా ఉన్నాయి.
రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 2021లో 50వ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నాయి. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్ ను సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
అంతకు ముందు పీఎం రాజ్ ఘట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఇరు దేశాల మధ్య ముందున్న ప్రధాన సమస్యలు పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం. వీటిపై రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయని స్పష్టం చేశారు షేక్ హసీనా.
Also Read : ట్రబుల్ షూటర్ ప్రధాని అవుతారా