Bank Holidays 21 : 21 రోజులు బ్యాంకులకు సెలవు
అక్టోబర్ నెలలో ఖాతాదారులకు షాక్
Bank Holidays 21 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ బ్యాంకులకు పెద్ద ఎత్తున సెలవులను ప్రకటించింది. ఒక్క అక్టోబర్ నెలలో ఏకంగా 21 రోజుల పాటు సెలవులు(Bank Holidays 21) ఇస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
ఈ మొత్తం సెలవుల్లో అన్ని ఆదివారాలు, నెలలోని రెండవ, నాల్గవ శనివారాలు ఉన్నాయి. సెలవుల జాబితాను ఆర్బీఐ ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్ , హాలిడే , రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ హాలిడే , బ్యాంక్ ల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ అనే మూడు కేటగిరీల కింద ఈ సెలవులను ప్రకటించింది ఆర్బీఐ.
ఇందులో దుర్గా పూజా, కర్వా చౌత్ , దీపావళి వంటి అనేక ప్రాంతీయ పండుగలలో కూడా బ్యాంకులు పని చేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే
క్యాలెండర్ ప్రకారం ప్రాంతీయ సెలవుల కారణంగా అక్టోబర్ లో 15 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఆయా బ్యాంకులు వారి వారి ప్రాంతీయ అవసరాల మేరకు అనుగుణంగా తెరవాలని స్పష్టం చేసింది.
బ్రాంచ్ లు (శాఖలు) మూసి వేసినా ఈ సెలవు రోజుల్లో ఆన్ లైన్ బ్యాంకింగ్ , యూపీఐ వంటి సౌకర్యాలు లేదా సేవలకు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవని వెల్లడించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెలవుల జాబితా ఇలా ఉంది.
అక్టోబర్ 2 మొదటి ఆదివారం. 8వ తేదీ రెండవ శనివారం, 9వ తేదీ రెండవ ఆదివారం 16వ తేదీ మూడవ ఆదివారం. 22వ తేదీ నాల్గవ శనివారం, 23వ
తేదీ నాల్గవ ఆదివారం, 30వ తేదీ ఐదవ ఆదివారం ఉన్నాయి.
ఇక జాతీయ, ప్రాంతీయ సెలవులు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 1 శనివారం బ్యాంకు ఖాతాల అర్ద సంవత్సరం ముగింపు. 3వ తేదీ దుర్గా పూజ (మహా అష్టమి)
, అగర్తల, భువనేశ్వర్ , గౌహతి, ఇంఫాల్ , కోల్ కతా , పాట్నా, రాంచీ లో ఉంటుంది.
4వ తేదీ దుర్గా పూజ లేదా దసరా (మహా నవమి) . అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్ , గౌహతి, కాన్పూర్ , కొచ్చి, కోల్ కతా, పాట్నా, రాంచీ,
షిల్లాంగ్, తిరువనంతపురం లో సెలవులు(Bank Holidays 21) ఉంటాయి.
5వ తేదీ దుర్గా పూజా దసరా (విజయ దశమి) శంకర దేవుని జన్మోత్సవం, ఇంఫాల్ మినహా దేశంలోని అన్ని ప్రాంతాలలో సెలవు ఉంటుంది. 6న దుర్గా పూజా గాంగ్టక్ , 7న దుర్గా పూజా, 8వ తేదీ మిలాద్ ఇ షెరీఫ్ – మహ్మద్ ప్రవక్త జన్మదినం, భోపాల్ , జమ్ము కొచ్చి, శ్రీనగర్ , తిరువనంతపురం లో ఉంటుంది.
13న కర్వా చౌత్ సిమ్లాలో అమలవుతుంది. 14న ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ శుక్రవారం జమ్మూ , శ్రీనగర్. 18న కటి బిహు గౌహతిలో ఉంటుంది. 24న కాళీ పూజా దీపావళి పండుగ హైదరాబాద్ , ఇంఫాల్ మినహా దేశమంతటా వర్తిస్తుంది. 25న లక్ష్మీ పూజ గాంగ్లక్ , హైదరాబాద్ , ఇంఫాల్ , జైపూర్ ఉన్నాయి.
26న గోవర్దన పూజ , దీపావళి, లక్ష్మీ పూజ ప్రవేశ దినం – అహ్మదాబాద్ , బేలాపూర్ , బెంగళూరు, డెహ్రాడూన్ , గాంగ్ టక్ , జమ్మూ , కాన్పూర్ , లక్నో , ముంబై , నాగపూర్ , సిమ్లా, శ్రీనగర్ . 27న దీపావళి, 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజు.
Also Read : 5జీ టెస్టింగ్ మోదీ కారు డ్రైవింగ్ సక్సెస్