Obama Michelle : వైట్ హౌస్ కు తిరిగి వచ్చిన ఒబామా
భార్య మిచెల్ కూడా ఎందుకంటే
Obama Michelle : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా(Obama Michelle) తిరిగి వైట్ హౌస్ కు చేరుకున్నారు. అధ్యక్షుడిగా కాదు మాజీ చీఫ్ గా ఆయన తన వారితో అడుగు పెట్టడం సంప్రదాయ బద్దంగా వస్తున్నదే.
తమ వారసుడి పదవీ కాలంలో పోర్ట్రెయిట్ ల ఆవిష్కరణ కోసం వైట్ హౌస్ కు తిరిగి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రక్రియ అమెరికాకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కొనసాగుతోంది.
మాజీ అధ్యక్షుడితో పాటు మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా తమ అధికారిక చిత్రాల ఆవిష్కరణ కోసం బుధవారం వైట్ హౌస్ కు చేరుకున్నారు.
ఒరాక్ ఒబామా పదవీ విరమణ చేసినప్పటి నుండి దాదాపు 5 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన వైట్ హౌస్ లో జో బైడెన్ వారికి ఆతిథ్యం ఇవ్వనున్నారు.
ఇదిలా ఉండగా అమెరికా దేశానికి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధికారంలో ఉండగా బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా వేడుకలను నిర్వహించ లేదు.
అయితే బరాక్ ఒబామా 2012లో ఒబామా మొదటి పదవీ కాలంలో మాజీ చీఫ్ జార్జ్ డబ్ల్యూ బుష్ , ఆయన భార్య లారా వారి పోర్ట్రెయిట్ ఆవిష్కరణలకు ఆతిథ్యం ఇచ్చారు.
ఒబామాలు, బైడెన్ లు ఒబామా చీఫ్ గా ఉన్న సమయంలో ఏర్పడిన సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ , ప్రథమ మహిళ ప్రోర్ట్రెయిట్ ల ఆవిష్కరణకు ఆతిథ్యం ఇచ్చేందుకు గౌరవించ బడతారు.
వైట్ హౌస్ గోడలపై ఇది ఎప్పటికీ ఆశ. రిమైండర్లుగా వేలాడ దీయ బడుతుందని బైడెన్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ తెలిపారు.
Also Read : కొత్త రకం వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్