Barrelakka Security : బర్రెలక్కకు హైకోర్టు భరోసా
భద్రత ఇవ్వాలని ఆదేశం
Barrelakka : కొల్లాపూర్ – రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కొల్లాపూర్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్కకు శుభ వార్త చెప్పింది హైకోర్టు. ఇరు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు మద్దతు పెరుగుతోంది. ఇదే సమయంలో రోజు రోజుకు బర్రెలక్క శిరీషకు మద్దతు పెరుగుతోంది. భారీ ఎత్తున అన్ని వర్గాలకు చెందిన ఆమె వెంట నడుస్తున్నారు.
Barrelakka Got Security
ఆమెకు మద్దతుగా లాయర్లు నిలిచారు. ఇదే సమయంలో ప్రచారం చేస్తున్న సమయంలో బర్రెలక్క సోదరుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు దిగారు. దీంతో శిరీషతో పాటు ఆమె అనుచరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇదే సమయంలో ప్రజా సంఘాలు, పేరు పొందిన న్యాయవాదులు, మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజా స్వామిక వాదులు పెద్ద ఎత్తున బర్రెలక్కకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు. ఇదే విషయాన్ని ఆమెతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఎస్పీకి, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఆమెపై కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు దాడి చేయించే ప్రమాదం ఉందని , వెంటనే సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు(High Court) బర్రెలక్కకు ఒక గన్ మెన్ ను ఏర్పాటు చేయాలలని ఆదేశించింది.
Also Read : Bandi Sanjay Kumar : కేసీఆర్ పాలన అస్తవ్యస్తం