Haryana CM : 24 గంటలు బార్లు ఓపెన్ – సీఎం
రెస్టారెంట్ లు కూడా ప్రారంభం
Haryana CM : హర్యానలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో ఇక నుంచి 24 గంటల పాటు బార్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar). రాష్ట్రంలో కొత్తగా మద్యం పాలసీ తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది హర్యానా సర్కార్. గతంలో కార్పొరేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు బీరు, వైన్ సేవించేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు సీఎం. కొంత సమయం వరకు మాత్రమే పర్మిషన్ ఉండేది. కానీ ఇప్పుడు దానిని కూడా ఎత్తేసింది ప్రభుత్వం.
తగిన ఫీజు చెల్లించి 24 గంటల పాటు బీర్లు, వైన్లు ఉండే బార్లను , రెస్టారెంట్లను ఓపెన్ చేసుకోవచ్చంటు ఖుష్ కబర్ చెప్పారు సీఎం. మరో వైపు నిత్యం భారతీయ సంస్కృతి, సంప్రదాయం, నాగరికత గురించి బోధించే , నీతి కథలు చెప్పే భారతీయ జనతా పార్టీ ఫక్తు కార్పొరేట్ కల్చర్ ను వంట పట్టించుకుంటోంది.
విలువలకు తిలోదకాలు ఇస్తూ ఫక్తు వ్యాపారంగా మారి పోయింది. ఇప్పటికే గౌతం అదానీ, ముఖేష్ అంబానీ, రతన్ టాటా ల జపం పాడుతున్న మోదీ సర్కార్ మద్యం వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా బార్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసుకోవచ్చుంటూ ప్రకటించడం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా బీజేపీ ఎదుటి వాళ్లకు చెప్పేందుకు మాత్రమే నీతులు అని తమకు మాత్రం వర్తించవంటూ హర్యానా ప్రభుత్వం నిరూపించింది.
Also Read : Jailer Kavaalaa Song : జైలర్ ‘కావాలా’ సాంగ్ సెన్సేషన్