Basara Protest : మంత్రి ఇంటి ముందు పేరెంట్స్ ఆందోళన
పిల్లలను చంపేస్తారా అంటూ నిరసన
Basara Protest : బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న పిల్లలు మళ్లీ ఆందోళనకు దిగారు. భోజనం చేయకుండా విద్యా సంస్థలో నిరసన చేపట్టారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని, తమకు నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసు కోవాలని వెళ్లిన ఎంపీని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో తమ పిల్లలను చంపేస్తారా అంటూ పేరెంట్స్ ఆందోళన బాట పట్టారు. ఆదివారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగారు.
ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో సుదీర్ఘ నిరసనకు దిగిన విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి ఇప్పుడు నోరు ఎందుకు మెదపడం లేదంటూ ప్రశ్నించారు.
ఈ పిల్లలు మీ పిల్లలు కారా అంటూ నిలదీశారు. ప్రభుత్వం కావాలని బాసర ఐఐఐటీని పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు.
తమ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని , పిల్లలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేక పోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని బాసర విద్యార్థుల పేరెంట్స్(Basara Protest) హెచ్చరించారు.
గతంలో ఇచ్చిన హామీలను మరిచి పోయారని, కావాలని కాలయాపన చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రావడంతో భారీగా పోలీసులను మోహరించారు.
ఓ వైపు విద్యార్థులు మరో వైపు పేరెంట్స్ ఆందోళనకు దిగినా ఇప్పటి వరకు మంత్రి కానీ , రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించు కోక పోవడం దారుణమని అంటున్నాయి ప్రతిపక్షాలు.
Also Read : చదువు కోవడమే వీళ్లు చేసిన పాపమా