Bathukamma : బతుకమ్మ ఆడిన ముస్లిం మహిళలు
తెలంగాణ అంతటా బతుకమ్మ ఉత్సవాలు
Bathukamma : హైదరాబాద్ – తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం బతుకమ్మ పండుగ. ప్రతి ఏటా అమవాస్యను పురస్కరించుకుని ప్రతి అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ బతుకమ్మను మహిళలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఒక రకంగా ఆడబిడ్డల ఆర్త నాదం, జీవన స్వరం అని చెప్ప వచ్చు.
Bathukamma Celebrations
తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఇప్పుడు బతుకమ్మలై(Bathukamma) ఆడుతున్నారు..పాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కే తలమానికంగా నిలిచిన గోల్కొండ కోటపై ముస్లిం మహిళలు ప్రత్యేకంగా బతుకమ్మలై ఆడడం విస్తు పోయేలా చేసింది.
ప్రభుత్వం కూడా ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తోంది ఈ బతుకమ్మ పండుగను. రోజుకో పూలతో బతుకమ్మను అలంకరిస్తారు. పూజలు చేస్తారు. పిండి వంటలతో నైవేద్యంగా సమర్పిస్తారు. మొత్తంగా వేలాది మంది తరలి వస్తున్నారు. ఆడి పాడేందుకు పోటీ పడుతున్నారు.
మొత్తంగా బతుకమ్మను ఒకప్పుడు గేలి చేసిన వాళ్లు ఇప్పుడు బతుకమ్మను ఆదరిస్తున్నారు. ఆడకుండా ఉండలేక పోతున్నారు. ఈసారి విశేషం ఏమిటంటే ముస్లిం మహిళలు సామాన్యంగా బయటకు రారు. కానీ ఇప్పుడు హిందూ మహిళలకు తీసిపోని రీతిలో బతుకమ్మ ఆడారు.
Also Read : TTD Security : శ్రీవారి గరుడ సేవకు ట్రాఫిక్ మళ్లింపు