Bathukamma Festival : ఆడ‌బిడ్డ‌ల సంబురం బ‌తుక‌మ్మ ఉత్స‌వం

నేటి నుండి 9 రోజుల పాటు ఉత్స‌వాలు

Bathukamma Festival : తెలంగాణ – ప్ర‌పంచ వ్యాప్తంగా బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు వైభ‌వంగా జ‌ర‌గ‌నున్నాయి. ఎంగిలిపూల బ‌తుక‌మ్మ‌తో శ‌నివారం నుండి వేడుక‌లు స్టార్ట్ అవుతాయి. తీరొక్క పూల‌తో బ‌తుక‌మ్మ‌ను పేర్చి ఆడి పాడేందుకు ఆడ‌బిడ్డ‌లు సిద్ద‌మ‌య్యారు.

Bathukamma Festival Viral

ప్ర‌తి రోజూ ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన నైవేద్యం స‌మ‌ర్పిస్తారు. మొద‌టి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువ‌తీ యువ‌కులు పాల్గొంటారు. చివ‌రి రోజు స‌ద్దుల బ‌తుక‌మ్మ‌తో ముగుస్తుంది.

తొలి రోజు ఎంగిలి పూల బ‌తుక‌మ్మను చేప‌డ‌తారు. మ‌హా అమ‌వాస్య రోజు ఇవాళ కావ‌డంతో వేడుక మొద‌లైంది. పెత్త‌రామ‌స అని కూడా పిలుస్తారు. నువ్వులు బియ్యం పిండి , నూక‌లు క‌లిపి నైవేద్యం త‌యారు చేసి స‌మ‌ర్పిస్తారు.

రెండో రోజు అటుకుల బ‌తుక‌మ్మ చేప‌డ‌తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేస్తారు. అమ్మ వారికి సమర్పిస్తారు.

మూడో రోజు ముద్ద ప‌ప్పు బ‌తుక‌మ్మ నిర్వ‌హిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

నాల్గ‌వ రోజు నానే బియ్యం బతుక‌మ్మ చేస్తారు. ఇందులో భాగంగా నాన బెట్టిన బియ్యం, పాలు, బెల్లం క‌లిపి నైవేద్యం స‌మ‌ర్పిస్తారు.

అయిద‌వ రోజు అట్ల బ‌తుక‌మ్మ‌ను చేప‌డ‌తారు. అట్లు లేదా దోశల‌ను బ‌తుక‌మ్మ‌కు నైవేద్యంగా ఇస్తారు మ‌హిళ‌లు.

ఆర‌వ రోజ‌జు అలిగిన బ‌తుక‌మ్మ ను నిర్వ‌హిస్తారు. ఆశ్వ‌యుజ పంచ‌మి. ఈరోజు మాత్రం బ‌తుక‌మ్మ‌కు ఎలాంటి నైవేద్యం స‌మ‌ర్పించ‌రు.

ఏడ‌వ రోజు వేప కాయ‌ల బ‌తుక‌మ్మ చేప‌డ‌తారు. బియ్యం పిండిని బాగా వేయిస్తారు. వేప పండ్లుగా త‌యారు చేసి నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు.

ఎనిమిద‌వ రోజు వెన్నె ముద్ద‌ల బ‌తుక‌మ్మ(Bathukamma ) నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లెం క‌లిపి నైవేద్యం త‌యారు చేస్తారు. అమ్మ వారికి స‌మ‌ర్పిస్తారు.

తొమ్మిదవ రోజు స‌ద్దుల బ‌తుక‌మ్మను చేప‌డ‌తారు. ఆశ్వయుజ అష్టమి రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం స‌మ‌ర్పిస్తారు. ఇవాల్టితో బ‌తుక‌మ్మ పండుగ ముగుస్తుంది.

Also Read : Revanth Reddy : ఒకేసారి 119 స్థానాల‌కు అభ్య‌ర్థుల వెల్ల‌డి

Leave A Reply

Your Email Id will not be published!