DK Shiva Kumar : కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే 5 హామీల అమలుకు సంబంధించి ఖజానా భారం పెరిగింది. ఉచిత బియ్యానికి బదులు నగదు ఇస్తామని ప్రకటించారు సీఎం సిద్దరామయ్యారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అభివృద్ది కోసం మంజూరు చేసిన రూ. 11,000 కోట్లను పక్కదారి మళ్లించిందని కేంద్ర మంత్రి ఆరోపించారు.
DK Shiva Kumar Allegations
ఈ సమయంలో పుండు మీద కారం చల్లినట్లు కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం సంచలన ఆరోపణలు గుప్పించింది. తమకు సంబంధించి బకాయిలు చెల్లించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 15 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ ను సంఘం నేతలు చేసిన విమర్శలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఇప్పటికే క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న సీఎం సిద్దరామయ్యకు డీకే వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం(DK Shiva Kumar). కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎప్పుడైనా సరే తాము చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటేనే ముందుకు రావాలన్నారు. ఇదంతా ప్రస్తుత సర్కార్ పై కేంద్రం ఆడిస్తున్న కుట్రగా పేర్కొన్నారు.
Also Read : Swati Maliwal : బ్రిజ్ భూషణ్ మాటేంటి – స్వాతి మలివాల్