Jairam Ramesh : ఇంకోసారి నోరు జారితే జాగ్రత్త – జైరాం
బీజేపీపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్
Jairam Ramesh : పొద్దస్తమానం భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, హిందూత్వం గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్న సోనియా గాంధీ పట్ల అభ్యంతకరంగా మాట్లాడడం దారుణమన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్.
ఈ మేరకు ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సుదీర్ఘ లేఖ రాశారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడారు.
ఈ సందర్బంగా సోనియా గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా ఆ పదాలు తీవ్ర అభ్యంతరకరమైనవి. అంతే కాదు ఒక మహిళ పట్ల మాట్లాడాల్సిన మాటలు కాదు.
కానీ అలా మాట్లాడటం అన్ని పార్టీకి, నాయకుడి సంస్కారానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు జైరాం రమేష్. రాజకీయాలు అన్నాక విమర్శలు సద్విమర్శలు ఉండాలి కానీ ఇలా వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగడం మంచిది కాదని సూచించారు జైరాం రమేష్(Jairam Ramesh).
ఇదేనా మీరు నేర్పుతున్న సంస్కారం మీ నేతలకు అని గట్టిగా నిలదీశారు. ప్రస్తుతానికి వదిలి వేస్తున్నామని బేషరతుగా సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రేమ్ శుక్లా కానీ లేదా ఇతర నాయకులు ఎవరైనా నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే విషయంపై పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాం రమేష్.
Also Read : ఉద్దవ్ ఠాక్రే వల్లనే సర్కార్ కూలింది