Arabic Kuthu Beast : బీస్ట్ ‘అర‌బిక్ కుతు సింగిల్’ అదుర్స్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Arabic Kuthu Beast : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌ల‌ప‌తి విజ‌య్, పూజా హెగ్డే న‌టించిన బీస్ట్ మూవీకి సంబంధించి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్.

ఈ మూవీకి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నాడు. కామెడీ, యాక్ష‌న్ , థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో దీనిని తెర‌కెక్కించారు. ఇటీవ‌లే బీస్ట్ మూవీ(Arabic Kuthu Beast) షూటింగ్ కూడా పూర్త‌యింది.

ఇదిలా రిలీజ్ చేసిన సింగిల్ ప్రోమో వెరీ డిఫరెంట్ గా తీశారు. అర‌బిక్ నేప‌థ్యం రూపొందించారు సాంగ్ ను. ఈ పాట‌కు సంబంధించిన సింగిల్ అర‌బిక్ కుతు పేరుతో రిలీజ్ చేశారు.

విడుద‌లైన కొద్ది నిమిషాల లోపే లక్ష‌ల్లో వ్యూస్ తో దూసుకు పోతోంది. ఇప్ప‌టికే త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఇల‌య త‌ళ‌ప‌తి విజ‌య్.

ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించింది. ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ దుమ్ము రేపింది. బాక్స్ ల‌ను బ‌ద్ద‌లు కొట్టింది.

త్వ‌ర‌లో రాబోయే ఈ బీస్ట్ మూవీపై(Arabic Kuthu Beast) భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక మూవీ విష‌యానికి వ‌స్తే నెల్స‌న్ దిలీప్ కుమార్ ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

విజ‌య్, పూజాతో పాటు సెల్వ రాఘ‌వ‌న్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, వీటీవీ గ‌ణేష్ , అప‌ర్ణా దాస్ , ఫ‌రూక్ , అజిత్ విక‌ల్, స‌తీష్ కృష్ణ‌న్ , త‌దిత‌రులు న‌టించారు.

ఈనెల 14న ప్రేమికుల రోజున ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేక‌ర్స్.

Also Read : అంత‌టా ‘ల‌బ్ డ‌బ్’ సాంగ్ సంద‌డి

Leave A Reply

Your Email Id will not be published!