Temjen Imna Along : అందమే ఆనందం ఆరోగ్యం ముఖ్యం
నాగాలాండ్ మంత్రితో అమ్మాయిలు
Temjen Imna Along : నాగాలాండ్ లో ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన మోస్ట్ పాపులర్ లీడర్ గా వినుతికెక్కిన రాష్ట్ర మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యారు. ఆయన ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. టెమ్ జెన్ ఇమ్నా(Temjen Imna Along) ఏం చేసినా లేక ఏది మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి బీజేపీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లలో టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ కూడా ఒకరు.
ఆయన ఒకప్పుడు టీచర్ గా పాఠాలు చెప్పారు. అనుకోకుండా బీజేపీలో చేరారు. అంచెలంచెలుగా పార్టీ చీఫ్‌గా ఉన్నారు. అధికారంలోకి వచ్చేలా చేయడంలో పార్టీని నడిపించారు. ఆ తర్వాత మోదీ దృష్టిలో పడ్డారు. నాగాలాండ్ లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన నవ్వు, చిన్న కళ్లు ఇప్పుడు లక్షలాది మందిని ఇష్టపడేలా చేశాయి. తన అభిరుచులు, అలవాట్లు , పర్యటనల గురించి , వింతలు, విశేషాల గురించి నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్.
తాజాగా ఆయన తనకు ఇష్టమైన ఆహారాన్ని తింటూ ఉన్నారు. టెమ్ జెన్ ఇమ్నా వెనుక అందమైన అమ్మాయిలు ఉన్నా కూడా పట్టించు కోలేదు. తనకు ఆహారం కంటే అందం ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఎందుకంటే ఆరోగ్యమే ఆనందం అంటారు ఇమ్నా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఎంతైనా ఇమ్నానా మజాకా అంటున్నారు నెటిజన్లు. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే లైకులు, కామెంట్లతో నిండి పోయింది.
Also Read : బలగం చిత్రానికి అవార్డుల పంట
Girls, I promise I'm not ignoring you. I'm just having a moment with my food. 😉 pic.twitter.com/Dg6psXJR1w
— Temjen Imna Along (@AlongImna) April 3, 2023