Jack Dorsey : ట్విట్ట‌ర్ కంపెనీగా మార‌డం బాధాక‌రం

ఫౌండ‌ర్, మాజీ సిఇఓ జాక్ డోర్సే కామెంట్స్

Jack Dorsey : ట్విట్ట‌ర్ ఫౌండ‌ర్, మాజీ సీఇఓ జాక్ డోర్సే షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్ట‌ర్ పై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ లో టాప్ లో కొన‌సాగుతోంది మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్.

విచిత్రం ఏమిటంటే సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ కంపెనీగా మారినందుకు చింతిస్తున్న‌ట్లు జాక్ డోర్సే (Jack Dorsey) పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ పంచుకున్నారు.

బిలియ‌నీర్ ఎలోన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం పూర్త‌యితే డోర్సేకి $978 మిలియ‌న్లు అందుతాయి. ట్విట్ట‌ర్ ఏ నిర్మాణంలో ప‌ని చేయాల‌ని అత‌ను కోరుకుంటున్నాడ‌ని అడిగిన‌ప్పుడు , డోర్సే అది ప్రోటోకాల్ అయి ఉండాల‌ని పేర్కొన్నాడు.

ట్విట్ట‌ర్ అనేది కంపెనీ యాజ‌మాన్యంలో ఉండ కూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రోటోకాల్ గా మారితే ట్విట్ట‌ర్ అనేది ఒక కేంద్రీకృత నియంత్రించ‌బ‌డ‌ని ఇమెయిల్ లాగా ప‌ని చేస్తుంద‌న్నారు.

విభిన్న ఇమెయిల్ ప్రొడైవ‌ర్ల‌ను ఉప‌యోగించే వ్య‌క్తులు ఒక‌రితో ఒక‌రు సంభాషించ‌గ‌లుగుతారు. ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేసేందుకు టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్(Elon Musk) $44 బిలియ‌న్ల ఆఫ‌ర్ నుండి దూరంగా వెళ్ల‌డాన్ని ఆపేక్షించింది.

ఈ మేర‌కు మ‌స్క్ పై దావా వేసింది. కోర్టుకు ఎక్కింది. ట్విట్ట‌ర్ వ‌ర్సెస్ ఎలోన్ మ‌స్క్ గా మారి పోయింది. తాను అడిగిన మేర‌కు ట్విట్ట‌ర్ వివ‌రాలు ఇవ్వ‌లేదంటూ ఆరోప‌ణ‌లు చేశాడు.

అందుకే తాను కొనుగోలు చేయ‌లేక పోతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. దీనిని పూర్తిగా త‌ప్పు ప‌ట్టింది ట్విట్ట‌ర్. ఒప్పందం చేసుకున్న స‌మ‌యంలో ఇలాంటివి ఏవీ లేవ‌ని స్ప‌ష్టం చేశారు ట్విట్ట‌ర్ సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్.

Also Read : బైడెన్ కుమారుడి స్టోరీ సెన్సార్ నిజ‌మే

Leave A Reply

Your Email Id will not be published!