Gali Janardhan Reddy : ‘గాలి’కి కోర్టులో ఎదురుగాలి

కేఆర్పీపీ ఆస్తులు అటాచ్ కు ఆదేశం

Gali Janardhan Reddy : క‌ర్ణాట‌క‌కు చెందిన మైనింగ్ డాన్ గా పేరు పొందిన కేఆర్పీపీ చీఫ్ , గంగావ‌తి ఎమ్మెల్యేగా ఇటీవ‌ల గెలుపొందిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు ఈ ఏడాది ఏమంతగా క‌లిసి రాన‌ట్టుంది. తాజాగా కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 2009 నుంచి కొనుగోలు చేసిన జ‌నార్ద‌న్ రెడ్డి ఆస్తుల‌ను అటాచ్ చేయాల‌ని బెంగ‌ళూరు లోని ప్ర‌త్యేక న్యాయ స్థానం ఆదేశించింది. మంగ‌ళవారం ఈ తీర్పుతో ఖంగుతిన్నారు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలంగా ఆయ‌న బీజేపీలో ఉన్నారు. గ‌తంలో మంత్రిగా ప‌ని చేశారు. భారీ ఎత్తున మైనింగ్ స్కాంకు పాల్ప‌డ్డారు. అరెస్ట్ కూడా అయ్యారు. ఆపై బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ కేసు ఇంకా న‌డుస్తోంది. తాజాగా క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి(Gali Janardhan Reddy).

కొత్త‌గా పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలుచున్నారు. త‌న భార్య‌ను కూడా నిల‌బెట్టారు. కానీ కాంగ్రెస్ ధాటికి అటు బీజేపీకి చెందిన చాలా మంది ఓట‌మి పాలు కాగా మ‌రో వైపు గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి సంబంధించిన అభ్య‌ర్థులు ఎవ‌రూ గెలుపొంద లేదు. ఒక్క గాలి త‌ప్ప. ఆయ‌న గంగావ‌తి నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

దాదాపు ఈ గాలిపై రూ. 35,000 కోట్ల మైనింగ్ కుంభ కోణానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Also Read : PM Modi : గ‌త పాల‌కుల‌పై మోదీ సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!