Kiren Rijiju : ప్రపంచంలో కంటే భారత్ లోనే బెటర్ – రిజిజు
న్యాయ శాఖ మంత్రి సంచలన కామెంట్స్
Kiren Rijiju : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ఖాళీలను భర్తీ చేయక పోవడం, మౌలిక సదుపాయాలను కల్పించక పోవడం వల్లనే దేశంలో వేలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. తాజాగా జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన సమావేశంలో సీజేఐ ఈ కామెంట్స్ చేశారు.
దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) స్పందించారు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత దేశంలోనే న్యాయ వ్యవస్థకు అపారమైన గౌరవం, గుర్తింపు, స్వేచ్ఛ ఉందన్నారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఈ దేశంలో ఉన్నంత స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇంకెక్కడా వెదికినా కనిపించదన్నారు.
సీజేఐ రమణ పలు కేసుల్లో మీడియా విచారణ గురించి మాట్లాడిన తర్వాత కిరణ్ రిజిజు(Kiren Rijiju) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలు దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి.
ఎవరికైనా అలా అనిపిస్తే పబ్లిక్ డొమైన్ లో చర్చించ వచ్చని తెలిపారు. సీజేఐ చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడటం సరి కాదన్నారు కిరణ్ రిజిజు.
భారత దేశానికి చెందిన న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ పూర్తిగా సెక్యూర్డ్ గా ఉందన్నారు. ఇలాంటి వ్యవస్థ ఇంకెక్కడా లేదని మాత్రం తాను స్పష్టం చేయగలనని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
Also Read : అవగాహన లేని చర్చలు హానికరం – సీజేఐ