Bhagat Singh Koshyari : కోశ్యారీ ‘ఛత్రపతి’ కామెంట్స్ పై కన్నెర్ర
పాత రోజుల్లో శివాజీ ఐకాన్ ఇప్పుడు కాదు
Bhagat Singh Koshyari : దేశంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరాక గవర్నర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా బీజేపీయేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇబ్బందికరంగా మారారన్న విమర్శలు ఉన్నాయి.
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్లు వ్యక్తిగత అంశాలలో తల దూర్చడం మామూలై పోయింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా గవర్నర్లు, సీఎంల వ్యవహారం నువ్వా నేనా అన్న రీతిన తయారైంది. ఇక గవర్నర్లు స్థాయిని మరిచి మాట్లాడుతుండడం విస్తు పోయేలా చేస్తోంది.
ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ(Bhagat Singh Koshyari). ఆయన గతంలో గుజరాతీయులు వల్లనే మహారాష్ట్ర దేశానికి రెండో ఆర్థిక రాజధానిగా మారిందని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున మరాఠాలో ఆందోళనలు కొనసాగాయి. చివరకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ దిగి వచ్చారు.
తప్పు అయ్యిందంటూ క్షమించమంటూ వేడుకున్నారు. తాజాగా మరాఠా యోధుడిగా కోట్లాది మందికి ఆదర్శ ప్రాయంగా ఉన్న ఛత్రపతి శివాజీపై నోరు పారేసుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఔరంగాబాద్ లోని డాక్టరేట్ ప్రదానోత్సవం సందర్భంగా పాల్గొన్న గవర్నర్ శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
పాత రోజుల్లో ఛత్రపతి శివాజీని ఐకాన్ (రోల్ మోడల్ ) గా భావించే వారని కానీ ఇప్పుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ , గడ్కరీని ఐకాన్ గా భావిస్తున్నారంటూ స్పష్టం చేశారు. దీంతో తమ యోధుడిని అవమానిస్తారా అంటూ మండి పడుతున్నారు.
Also Read : సావర్కర్ ను విమర్శించే హక్కు లేదు – సీఎం