Sharad Pawar : భగత్ సింగ్ కోష్యారీ గవర్నర్ కు తగడు – పవార్
చరిత్ర తెలియదంటూ ఎన్సీపీ చీఫ్ ఆగ్రహం
Sharad Pawar : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ ను అవమానించిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీపై ఇంకా ఆగ్రహం వ్యక్తం అవుతూనే ఉంది. ఇప్పటికే ఆయనను తొలగించాలని రాష్ట్ర సంకీర్ణ సర్కార్ లో కీలక పాత్ర పోషిస్తున్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆయనను ఇతర ప్రాంతాలకు పంపించాలని కోరారు. ఈ తరుణంలో శివసేన ఉద్దవ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సైతం నిప్పులు చెరిగారు. ఆయనకు చరిత్ర తెలియదని , వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశారు.
ఈ తరుణంలో మహా వికాస్ అఘాడీలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మరాఠా గవర్నర్ కోష్యారీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చరిత్ర తెలియని వాళ్లను కేంద్రం ఉన్నత పదవులలో ఎలా నియమిస్తారంటూ నిలదీశారు శరద్ పవార్.
ఇది పూర్తిగా మరాఠా ప్రజలను , యోధుడిని అవమానించినట్లేనని పేర్కొన్నారు ఎన్సీపీ చీఫ్. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదని వెంటనే గవర్నర్ ను ఇక్కడి నుంచి పంపించి వేయాలని కోరారు. గవర్నర్ స్థాయికి పనికి రాడంటూ నిప్పులు చెరిగారు.
గవర్నర్ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. కానీ ప్రజల మనోభావాలను దెబ్బ కొట్టేలా కామెంట్స్ చేసి ఉండాల్సింది కాదన్నారు శరద్ పవార్.
Also Read : సిద్దూ కేసులో ఎన్ఐఏ కస్టడీకి ‘బిష్ణోయ్’