Sidhu Mann : పీసీసీ మాజీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు గాను ఆప్ 92 సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటింది. సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇవాళ విధానసభలో సమావేశం అయ్యారు. ప్రజలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారంటూ ఫలితాల తర్వాత సిద్దూ (Sidhu Mann)కామెంట్ చేయడం కలకలం రేపింది.
ప్రస్తుతం మరో బాంబు పేల్చాడు. సీఎంగా కొలువుతీరిన భగవంత్ మాన్ కు గ్రీటింగ్స్ తెలిపారు ట్విట్టర్ వేదికగా సిద్దూ(Sidhu Mann). కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ఆదేశించారు.
కేవలం ఒకే ఒక్క లైన్ లో తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు సిద్దూ. భగవంత్ మాన్ పంజాబ్ లో కొత్త మాఫియా వ్యతిరేక శకానికి తెర లేపారని పేర్కొన్నారు.
ఆప్ ను ఎన్నుకోవడంలో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని వ్యక్తి మాన్. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు.
పంజాబ్ లో ఒక కొత్త మాఫియా వ్యతిరేక యుగాన్ని అంచనాల పర్వంతో ఆవిష్కరించాడు. ఈ విషయంలో సక్సెస్ అవుతాడని ఆశిస్తున్నట్లు సిద్దూ తెలిపారు. పంజాబ్ రాష్ట్రాన్ని పునరుజ్జీవన పథంలోకి తీసుకు వస్తాడని తెలిపారు.
ప్రజల విధానాలు ఎల్లప్పుడూ ఉత్తమమైనవని తెలిపారు. ఆయన స్వంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వచ్చాడు. తాను పంజాబ్ లోనే ఉంటానని ఎక్కడికీ వెళ్లనని స్పష్టం చేశారు నవజ్యోత్ సింగ్ సిద్దూ.
Also Read : 20న ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం