Bhagwant Mann : కాంట్రాక్టు టీచర్ల క్రమబద్దీకరణ – సీఎం
భగవంత్ మాన్ కు టీచర్ల జేజేలు
Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆయన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే తన కేబినెట్ లో అవినీతికి పాల్పడిన మంత్రిని సైతం తొలగించారు. ఎక్కడా అవినీతి లేకుండా పాలన సాగిస్తానని సీఎం ప్రమాణ స్వీకారం సందర్బంగా వెల్లడించారు. ఆ మేరకు తాను కూడా చర్యలు తీసుకోవడంలో ముందంజలో అందరికంటే ముందున్నారు.
Bhagwant Mann New Rule
దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రతి ఊరులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో పడ్డారు భగవంత్ మాన్(Bhagwant Mann). తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కాంట్రాక్టు పద్దతిన పని చేస్తున్న 12,500 మంది టీచర్లను క్రమబద్దీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు వారందరికీ పూర్తి స్థాయిలో నియామక పత్రాలు అందజేశారు. శుక్రవారం అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వారందరికీ అపాయింట్ మెంట్ ధ్రవీకరణ పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కాంట్రాక్టు టీచర్లు జేజేలు పలికారు. ఇలాంటి సీఎం ఒక్కడుంటే ఏ రాష్ట్రమైనా బాగు పడుతుందని ప్రశంసలు కురిపించారు.
Also Read : Congress GHMC : కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ముట్టడి ఉద్రిక్తం