Punjab Cabinet : 10 మందితో పంజాబ్ కేబినెట్

ప్ర‌క‌టించిన సీఎం భ‌గ‌వంత్ మాన్

Punjab Cabinet  : పంజాబ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కొలువు తీరిన భ‌గ‌వంత్ మాన్ (Punjab Cabinet )సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే కేబినెట్ లో ఎవ‌రు ఉండాల‌నే దానిపై తుది నిర్ణ‌యం తీసుకోవాల్సింది మాన్ అంటూ స్ప‌ష్టం చేశారు ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

ఇదిలా ఉండ‌గా ఎవ‌రైనా లంచం అడిగితే త‌న‌కు ఫోన్ చేయాల‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు పంజాబ్ లో ఈ కామెంట్ క‌ల‌క‌లం రేపింది. తాను సీఎంను కాన‌ని పంజాబ్ ప్ర‌జ‌ల‌కు కామ‌న్ మ్యాన్ ను అంటూ స్ప‌ష్టం చేశారు.

తాజాగా ఆప్ కేబినెట్ (Punjab Cabinet )లో ఎవ‌రు ఉంటార‌నే దానికి తెర దించారు సీఎం. కేవ‌లం 10 మందికి మాత్ర‌మే చోటు క‌ల్పించారు. వారిలో ఒక‌రు మాత్ర‌మే మ‌హిళ ఉన్నారు. ఇవాళ వారంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు.

గ‌తంలో 17 మందితో కేబినెట్ ఉండేది. కానీ దానికి భిన్నంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు భ‌గ‌వంత్ మాన్. ప్ర‌క‌టించిన పేర్ల‌లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన హ‌ర్పాల్ సింగ్ చీమా, డాక్ట‌ర్ బ‌ల్జిత్ కౌర్, హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఎతో, డాక్ట‌ర్ విజ‌య్ సింగ్లా, లాల్ చంద్ క‌ట‌రుచ‌క్ , ఎస్. గుర్మీర్ సింగ్ మీట్ హ‌య‌ర్ , ఎస్. కుల్దీప్ సింగ్ ధాలీవాల్ , లాల్జిత్ సింగ్ భుల్ల‌ర్ , బ్ర‌మ్ శంక‌ర్ – జింపా, హోర్జోత్ సింగ్ బెయిన్స్ ఉన్నారు.

ఇక జాబితాలో చీమా , హేయ‌ర్ మాత్ర‌మే పంజాబ్ ఎన్నిక‌ల్లో రెండోసారి గెలిచారు. ఇక కేబినెట్ లో ఒకే ఒక్క మ‌హిళ‌కు చోటు ద‌క్కింది. ఆమె డాక్ట‌ర్ బ‌ల్జీత్ కౌర్ .

46 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన కౌర్ కంటి డాక్ట‌ర్ గా ప‌ని చేసింది. త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలుపొందింది. రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు పంజాబ్ సీఎం.

Also Read : మారిన స్వ‌రం ‘మేడం’ స‌మ్మ‌తం

Leave A Reply

Your Email Id will not be published!