Bhagwant Mann Dance : భ‌గ‌వంత్ మాన్ భాంగ్రా అదుర్స్

జ‌త క‌ట్టిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా

Bhagwant Mann Dance : పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ డ్యాన్స్ తో అద‌ర‌గొట్టాడు. గుజ‌రాత్ లో ప‌ర్య‌టించిన సీఎం మాన్ సెన్సేష‌న్ సెల‌బ్రిటీగా మారారు. గుజ‌రాత్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో భాంగ్రాలోకి ప్ర‌వేశించాడు. ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్ లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కులు పండుగ స్పూర్తిని ర‌గిలించారు.

గ‌ర్భా డ్యాన్స్ తో కొన్ని భాంగ్రా క‌ద‌లిక‌ల‌ను మిక్స్ చేయ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకునేలా చేసింది. దేశంలోని ఇత‌ర ప్రాంతాల మాదిరిగానే రాజ్ కోట్ న‌గ‌రంలో నిర్వ‌హించిన భాంగ్రాలో పాల్గొన్నాడు. సీఎంకు స‌న్నిహితుడిగా పేరొందిన ఎంపీ రాఘ‌వ్ చద్దా కూడా వ‌డోద‌ర‌లో ఆనందోత్సాహాల మ‌ధ్య డ్యాన్స్ గ్రూప్ లో చేరాడు.

ప్ర‌స్తుతం గుజ‌రాత్ లో జ‌రిగిన ఈవెంట్ లో వేదిక‌పై సీఎం భ‌గ‌వంత్ మాన్ చేసిన డ్యాన్స్(Bhagwant Mann Dance) కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గ‌ర్భా అనేది గుజ‌రాతీల‌కు గ‌ర్వ కార‌ణ‌మైన నృత్య రూపం. న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం ప్ర‌తి ఏటా ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఇది దుర్గా దేవి గౌర‌వార్థం తొమ్మిది రాత్రులు సాగే హిందువుల పండుగ‌. ఇంత‌లో పంజాబ్ కు చెందిన ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా ట్విట్ట‌ర్ లో ఒక వీడియోను పంచుకున్నారు. వ‌డోద‌ర‌లో రోజు చివ‌రిలో గ‌ర్భా ఉత్స‌వంలో పాల్గొన్నారు. అంద‌రి శ్రేయ‌స్సు కోసం తాను ప్రార్థించాన‌ని తెలిపారు.  ప్ర‌స్తుతం మాన్ చేసిన డ్యాన్స్ సూప‌ర్ అంటున్నారు.

Also Read : హ‌లో వ‌ద్దు వందేమాత‌రం వాడాలి

Leave A Reply

Your Email Id will not be published!