Bhagwant Mann Flags : సింగపూర్ లో శిక్షణకు పంజాబ్ టీచర్లు
పంపించిన సీఎం భగవంత్ మాన్
Bhagwant Mann Flags : పంజాబ్ లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం భగవంత్ మాన్. ప్రత్యేకించి కొలువు తీరిన వెంటనే విద్యా రంగం, ఆరోగ్య రంగానికి ప్రయారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ బడులను ఆధునీకరించే పనిలో పడ్డారు. ఆపై ప్రతి చోటా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచ విద్యా రంగంతో పోటీ పడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Bhagwant Mann Flags Off
గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి అత్యధిక డబ్బులను కేటాయించారు సీఎం భగవంత్ మాన్. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) మేనిఫెస్టోలో విద్యకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బ్యాచ్ ల వారీగా టీచర్లను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇచ్చేందుకు గాను సింగపూర్ కు పంపిస్తున్నారు.
ఇప్పటి వరకు రెండు బ్యాచ్ లను ప్రారంభించారు. మొత్తం రాష్ట్రంలోని 72 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన
ప్రిన్సిపాల్స్ , హెడ్మాస్టర్లు ,ఇతర నైపుణ్యాలు కలిగిన టీచర్లను సింగపూర్ కు పంపించారు. స్వయంగా సీఎం భగవంత్ మాన్ తో పాటు విద్యా శాఖ మంత్రి వారికి వీడ్కోలు పలికారు.
ఇదిలా ఉండగా శిక్షణ కోసం వెళ్లిన ప్రతి ఒక్కరికీ అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుండడం విశేషం. ఇప్పటికే తొలి బ్యాచ్ కు మంచి ఆదరణ లభిస్తోంది.
Also Read : Buggana Rajendranath Reddy : వియత్నాంలో ‘బుగ్గన’ బిజీ